పాఠ్యపుస్తకాల విషయంలో విద్యాశాఖ నూతన విధానం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ పాఠ్య పుస్తకాల విషయంలో నూతన విధానం తీసుకొచ్చింది. 1 నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆయన వెబ్‌సైట్‌లో ఫ్రీ డౌన్‌లోడ్ యాప్‌ను బుధవారం ప్రారంభించారు. వెబ్‌సైట్ నుండి ఎవరైనా సరే ఫ్రీగా డైన్‌లోడ్ చేకుకోవచ్చన్నారు. వీటిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం నిషేధమని మంత్రి తెలిపారు.