AP: కొవిడ్ టెస్ట్ ధ‌ర‌లు త‌గ్గించిన ప్ర‌భుత్వం

 

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. క‌రోనా ఉద్ధృతి నేప‌థ్యంలో ఎపి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కొవిడ్ టెస్టుకు అధిక ధ‌ర‌లు వ‌సూలు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు రావ‌డంతో రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ రాష్ట్రంలో కొవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల ధ‌ర‌ల‌ను పునఃస‌మీక్ష నిర్వ‌హించింది. ఐసిఎమ్ ఆర్ అనుమ‌తి పొందిన ప్రైవేటు ల్యాబ్‌ల‌లో ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష‌కు రూ. 350గా నిర్థారిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.