ఎపి వైద్యారోగ్య శాఖ మంత్రి కార్యాలయంపై దాడి.. 30 మంది ఆరెస్ట్
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/AP-Health-Minister.jpg)
గుంటూరు (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గుంటూరులోని మంత్రి ఆఫీసుపై రాళ్ల దాడిచేసి, ఫ్లెక్సీలను చించివేశారు. ఆఫీసు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుకుని 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. టిడిపి-జనసేన కార్యకర్తలే దాడికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు.