AP: స్కూళ్ల‌కు ఇంట‌ర్నెట్‌.. పిడిఎఫ్ రూపంలో పాఠ్యాంశాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలోని అన్ని పాఠ‌శాల‌ల‌కు ఇంట‌ర్నెట్ స‌దుపాయం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించారు. తాడేప‌ల్లి సిఎం క్యాంపు కార్యాల‌యంలో సిఎం విద్యాశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. పాఠ‌శాల‌ల్లో పుస్తాకాల కొర‌త రానీయొద్ద‌ని, పాఠ్య‌పుస్త‌కాల కంటెంట్‌ను పిడిఎఫ్ ఫైల్స్ రూపంలో అంద‌రికీ అందుబాటులో ఉండేలా చూడాల‌ని సిఎం ఆదేశించారు. పాఠ‌శాల నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని, బాలిక‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై కౌన్సెలింగ్ ఇచ్చేవిధంగా ఒక మ‌హిళా ఉపాధ్యాయురాలిని నియ‌మించాల‌న్నారు. 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ట్యాబుల పంపిణీకి చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు. ఈ స‌మావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ‌, సిఎస్ స‌మీర్ శ‌ర్మ, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.