AP: విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లోకి రూ. 709 కోట్లు జ‌మ‌: సిఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లోకి రూ. 709 కోట్లు జ‌మచేశారు. ‘జ‌గ‌న‌న్న విద్యా దీవెన’ కింద అక్టోబ‌ర్-డిసెంబ‌ర్‌, 2021 త్రైమాసికానికి సుమారు. 10.82 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు బుధ‌వారం స‌చివాల‌యంలో సిఎం న‌గ‌దు జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఎవ‌రూ దొంగిలించ‌లేని ఆస్తి చ‌దువు అని, విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన ఎంతో సంతోషాన్ని ఇచ్చే ప‌థ‌కాల‌ని, చ‌దువు వ‌ల‌న జీవ‌న స్థితి గ‌తుల‌లో మార్పు వ‌స్తుంద‌ని అన్నారు. జ‌గ‌నన్న విద్యా దీవెన కింద 10.82 లక్ష‌ల మంది విద్యార్థుల‌కు ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.