AP: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గుహనాతన్ నరేందర్ ప్రమాణం..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం జడ్డిగా జస్టిస్ గుహనాథన్ నరేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనచే సోమవారం గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సిఎస్, డిజిపి తదితరులు పాల్గొన్నారు.