ఎపి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం

హైదరాబాద్ (CLiC2NEWS): ఎపి ఐటి, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45 గంటలకు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చే లోపే గౌతమ్ రెడ్డి కి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. గౌతమ్ రెడ్డి చనిపోయినట్లు 9.16 నిమిషాలకు వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు వైఎస్సార్సీపీ తరఫున ఆయన విజయం సాధించారు.