ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఎపి మంత్రి నారా లోకేశ్..

ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఐటిశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అమరావతికి వచ్చిన ప్రధాని.. తనను కలవాలని మంత్రి లోకేశ్‌కు సూచించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఆహ్వానం మేరకు శనివారం కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీ చేరకున్న మంత్రి .. ప్రధానిని మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు 2 గంటల పాటు సమావేశమైనట్లు సమాచారం.