ఎపి మంత్రి రోజాకు అస్వస్థత

అమరావతి (CLiC2NEWS): ఎపి పర్యాటక శాఖ మంత్రి, సినీనటి రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మంత్రి రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి కి కాలు బెణకడంతో 7 రోజులపాటు ఫిజియో థెరపీ వైద్యం చేయించారు. కానీ కాలి నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత పదిరోజులుగా కలి గాయం కారణంగా మంత్రి రోజా నియోజకవర్గ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.