Medical: మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో వైద్యావిద్యా విభాగంలో మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నేటి నుండి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డిఎంఇ పరిధిలో కార్డియాలజి, ఎండో క్రైనాలజి, మెడికల్ జిఇ నియోనాటాలజి, నెఫ్రాలజి, న్యూరోఎ సర్జన్, న్యూరాజి, పిడియాట్రిక్ సర్జరి, ప్లాస్టిక్ సర్జరి, సర్జికల్ జిఇ, సర్జికల్ అంకాలజి, యూరాలజి, వాస్కలర్ సర్జరి, అనస్థీషియా, డెర్మటాలజి .. మొత్తం 44 మిభాగాల్లో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అభ్యర్థులు పిజి (డిగ్రీ డిఎం ఎండి ఎంస్ డిఎన్‌బి డిఎంఎ ఐడి)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. పిజి పైనల్స్‌లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.