అవినీతిపై ఫిర్యాదుల‌కు ఎసిబి యాప్: సిఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎసిబి, దిశ‌, ఎస్ఈబి కార్య‌కాలాపాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. దిశ త‌ర‌హాలో అవినీవి ఫార్య‌దుల‌కుగానూ ఎసిబి యాప్ తేవాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం సిఎం క్యాంప్ కార్యాల‌యంలో హోంశాఖ‌పై సిఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఎసిబికి యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చ‌ని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాల‌ను క్లీన్ చేయాల్సిందేని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. నెల‌రోజుల్లోగా ఎసిబి యాప్ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంద‌ని, నేర నిర్ధార‌ణ‌కు ఫోరెన్సిక్ విభాగాన్ని బ‌లోపేతం చేయాల‌న్నారు. అలాగే మండ‌ల స్థాయి వ‌ర‌కూ ఎసిబి స్టేష‌న్లు ఉంటాయ‌ని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.