ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని

అమరావతి (CLiC2NEWS): ఎపిఎప్‌డిసి ఛైర్మన్‌గా పోసాని మురళీ కృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో ఈ బాధ్యతలు చేపట్టినట్లు పోసాని అన్నారు. ఈ పదవితో సినీ పరిశ్రమకు ఎంత మేలు చేస్తానో తెలియదు కానీ.. కీడు మాత్రం చేయనని పోసాని అన్నారు. అయితే ఖచ్చితంగా సినీ పరిశ్రమకు సేవచేస్తానన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి జరగాలని సిఎం ఆకాంక్షించారని, వంద ఎకరాల్లో స్టూడియోలు నిర్మాణం చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలనే సంకల్పం ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పుడు ఆబాధ్యత పోసాని మురళీకృష్ణకు వచ్చిందన్నారు.