వైద్యం ఖ‌ర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య‌శ్రీ వ‌ర్తించేలా చ‌ర్య‌లు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆరోగ్య‌శ్రీ‌ని మరింత బలోపేతం చేయాల‌ని ఎపి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆధికారుల‌ను ఆదేశించారు. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌లో నాడు-నేడు, ఆరోగ్య‌శ్రీ సిబ్బంది నియామ‌కంపై సిఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఆరోగ్య‌శ్రీ‌లో పొర‌పాట్లు, అక్ర‌మాల‌కు ఆస్కారం లేకుండా ల‌బ్ధిదారుల‌కు ప్ర‌త్యేక ఖాతాలు తెల‌ర‌వాల‌ని సూచించారు. ఈ ఖాతా నుండి డైరెక్టుగా వైద్యం అందించిన ఆసుప‌త్రికి న‌గ‌దు బ‌దిలీ చేయ‌ల‌న్నారు.

ప్ర‌స్తుతం ఆరోగ్య‌శ్రీ‌లో ఉన్న 2,436 చికిత్స‌ల సంఖ్య ఇంకా పెంచాల‌ని సూచించారు. వైద్యం ఖ‌ర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య‌శ్రీ కింద‌కి వ‌చ్చే దిశగా అడుగులు వేయాల‌న్నారు. ప్ర‌భుత్వ‌, బోధ‌నాస్ప‌త్రుల్లో సిబ్బంది కొర‌త ఉండ‌కూడ‌ద‌ని, త్వ‌ర‌లో 176 పిహెచ్‌సిలు పూర్తి చేసి, 2,072 పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.