హోంగార్డు నిర్వాకం..

నెల్లూరు (CLiC2NEWS): అధికారి సంత‌కం ఫోర్జ‌రీ చేసి ఓ హోంగార్డు రూ.1.40 కోట్లు కాజేశాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నెల్లూరు పోలీసు కార్యాల‌యంలోని బి సెక్ష‌న్‌లో ప‌నిచేస్తున్న హోంగార్డు.. అధికారుల‌కు న‌మ్మిన బంటులా వ్య‌వ‌హ‌రించేవాడు. కొన్ని సంవ‌త్స‌రాల‌నుండా పోలీసుల‌కు అంద‌జేసే జీతాల చెక్కుల్లో కొన్నింటిని త‌న పేరుతో రాయించుకున్నాడు. ఈ విధంగా మొత్తం రూ. 1.40 కోట్లు డ్రా చేశాడు. ఇటీవ‌ల పోలీసు శాఖ‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వ్య‌క్తికి ఇచ్చిన బెనిఫిట్స్ చెక్కు బౌన్స్ కావ‌డంతో హోంగార్డు చేతివాటం బ‌య‌ట‌ప‌డింది. ఎవ‌రివ‌రి పేరు మీద నిధులు డ్రా అయిన‌వో ఆరా తీసి.. హోంగార్డుపై కేసు న‌మోదు చేశారు. అత‌ని ఖాతా నుండి రూ. 1.36 కోట్లు రిక‌వ‌రీ చేసిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.