AP: సెక్రటేరియట్ ఎంప్లాయిస్ హెచ్ ఆర్ ఎ పెంపు

అమరావతి (CLiC2NEWS): సెక్రటేరియట్, హెచ్ ఒడి కార్యాలయ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఎ ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెంచింది. ప్రస్తుతం 16 శాతం హెచ్ ఆర్ ఎ ను 24 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా మొత్తం రూ. 25 వేలకు మించకుండా వర్తింప జేయాలని.. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. 2025 జూన్ వరకు ఈ హెచ్ ఆర్ ఎ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.