ఎపిఎస్ ఎస్ డిసి, డిఆర్‌డిఎ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో

విశాఖపట్నం (CLiC2NEWS): జిల్లాలోని గాజువాక వికాస్ నగర్ స్టీల్ సిటిలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో జులై 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్ ఎస్ డిసి), డిఆర్‌డిఎ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్‌మేళాలో 11 బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నట్లు సమాచారం. ఆసక్తి గల పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చని ప్రకటనలో తెలిపారు. మొత్తం 457 పోస్టులకు ఎంపిక జరగునుంది. పోస్టును అనుసరించి.. అభ్యర్థులు పది, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ తదితర కోర్సుల్లో అర్హత కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తుని, దువ్వాడ, అచ్చుతాపురం, మధురవాడ, యూసఫ్‌గూడ,హైదరాబాద్‌లలో పనిచేయవలసి ఉంటుంది. దరఖాస్తుకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.