మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం.. ఎపిలో రెండురోజులు సంతాప దినాలు
![](https://clic2news.com/wp-content/uploads/2022/02/GOWTHAM-REDDY.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తెలుగు రాష్ట్రాల పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
గౌతమ్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల ఎపి ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.