రుయా త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కావొద్దు.. సిఎం జ‌గ‌న్‌

అమరావ‌తి (CLiC2NEWS): రాష్ట్రంలో ఇక‌పై తిరుప‌తి రుయా త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృం కావొద్ద‌ని ఎపి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రి అంబులెన్స్ ఘ‌ట‌న‌పై సిఎం జ‌గ‌న్ తీవ్రంగా స్పందించారు. కొవిడ్ ప‌రిస్థితుల‌పై వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ సమావేశంలో సిఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. అనంత‌రం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా సిఎం మాట్లాడుతూ..

ఆస్ప‌త్రుల్లో ఫిర్యాదు నంబ‌ర్లు అంద‌రికీ క‌నిపించేలా ఉండాల‌న్నారు. ఎలాంటి స‌మ‌స్య ఎదుర్కొన్నా వెంట‌నే ఆ నంబ‌ర్ల‌కు ఫిర్యాదు చేసే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఒక‌టి రెండు ఘ‌ట‌న‌ల వ‌ల్ల మొత్తం వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని అన్నారు. విజ‌య‌వాడ ఆస్ప‌త్రి లాంటి ఘ‌ట‌న‌లు మ‌ర‌లా జ‌ర‌గ‌కుండా క‌ఠిన చ‌ర్చ‌లు తీసుకోవాల‌న్నారు. పోలీసుల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అల‌స‌త్వం వ‌హించార‌నే ఆరోప‌ణ‌ల‌తో సిఐ, ఎస్ ఐపై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, పోలీసు విభాగాలు స‌మ‌ర్ధంగా ప‌నిచేయాల‌ని సిఎం సూచించారు.

Leave A Reply

Your email address will not be published.