APSRTC: దసరాకు ప్రత్యేక బస్సులు.. అధనపు ఛార్జీల్లేవ్..
అమరావతి (CLiC2NEWS): దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికోసం ఎపిఎస్ఆర్టిసి 1,081 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. సెప్టెంబర్ 29వ తేది నుండి అక్టోబర్ 10 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రత్యేక బస్సులలో సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. విజయవాడ నుండి విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడకు.. విజయవాడ నుండి తిరుపతి రాయలసీమ జిల్లాలకు, విజయవాడ నుండి అమలాపురం, భద్రాచలం వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. టికెట్ రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఎపిఎస్ ఆర్టిసి వెబ్సైట్లో బస్సుల వివరాలను పొందుపరిచినట్లు వెల్లడించారు.