ఎపి హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి నగ్నంగా వ్యక్తి

అమరావతి (CLiC2NEWS): ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్ విచారణలకు వెసులుబాటు కల్పిస్తే.. కొందరు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ నెల 15వ తేదీన ఎపి హైకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలోకి ఓ వ్యక్తి నగ్నంగా ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షమయ్యాడు. దీనిని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కిట్టు అనే యూజర్ ఐడితో ఓ వ్యక్తి యాప్ ద్వారా 17వ కోర్టు విచారణలోకి లాగిన్ అయ్యాడు. ఒంటిపై దుస్తులు లేకుండా మంచంపై పడుకొని మాట్లాడుతూ కోర్టు విచారణకు ఉద్దేశపూర్వకంగా విఘతం కలిగించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆ లాగిన్‌ను బ్లాక్ చేశారు. అతని వివరాలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఐటి రిజిస్ట్రార్ తూళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.