వైకుంఠ ఏకాదశి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
తిరుమల (CLiC2NEWS): వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు తిరుమల శ్రీవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. వైకుంఠ ఏకాదశి ఒక్కరోజే రూ.7.68 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. గత యేడాదికంటే ఈ సంవత్సరం ఆదాయం భారీగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.