AP: రేపు టెన్త్ రిజల్స్..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో రేపు పదో తరగతి ఫలితాలు విడుదలకానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. శుక్రవారం ఆయన ఉపాధ్యాయ సంఘాలతో చర్చాలు నిర్వహించారు. అనంతరం ఆయన రేపు టన్త్ రిజల్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎపిలో ఏప్రిల్ 3 నుండి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.