వైజాగ్ బీచ్ కారిడార్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిలవాలి: సిఎం జగన్
అమరావతి (CLiC2NEWS): ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖపై సోమావారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, వాటిని మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఎం క్యాంప్ కార్యాలయంలో రహదారి భద్రతా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
విశాఖ బీచ్ కారిడార్ రోడ్డపై సిఎం సమీక్షించారు. భీమిలి-భోగాపురం మీదుగా ఎన్‌హెచ్-16కు అనుసంధానమయ్యే ఈ బీచ్ నిర్మాణంపై అధికారులు సిఎంకు వివరించారు. ఈమేరకు అధికారులకు సిఎం పలు సూచనలు చేశారు.
రోడ్డు డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలవాలన్నారు. విశాఖ నగరం నుండి భోగాపురం విమానాశ్రమంకు వీలైనంత త్వరగా రాకపోకలు జరిపేలా నిర్మాణం చేయలన్నారు. ఇప్పుడున్న విమానాశ్రయంలో పౌరవిమానాల రాకపోకలపై నిరంతరం ఆంక్షలు ఉంటున్నాయి. రాత్రి పూట ల్యాండింగ్‌కు ఆంక్షల కారణంగా కష్టమవుతోంది, ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సిఎం పేర్కొన్నారు.