AP: నామినేటెడ్ పోస్టుల ప్రకటన

సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీలో నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న 2 పదవులు విధానానికి గుడ్‌బై చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు పెద్దపీట వేశారు.
- మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68 పోస్టులు
- పురుషులకు 67 పదవులు కేటాయించారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కట్టబెట్టారు..
- 76 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు.
- 50 శాతం పోస్టులు ఈ వర్గాలకే కేటాయించామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 135 కార్పొరేషన్ చైర్మన్ ల పేర్ల ప్రకటించారు. వీటిలో దాదాపు 76 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, 59 ఓసీ వర్గానికి చెందిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మొత్తం పదవుల్లో 68 పదవులు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు. 56 శాతం వెనుకబడిన వర్గాలకు, 50.3 శాతం మహిళకు కేటాయించారు.
జిల్లాల వారీగా గమనిస్తే.. నామినేటెడ్ పోస్టుల వివరాలు..
- కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు
- సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
- వీఎంఆర్డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
- గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
- ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ
- మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి
- టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్
- హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
- డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
- బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
- బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్
- ఏలేశ్వరం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
- డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు
- ఉమన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా హేమమాలిని
- ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
- ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్ అస్లాం
- సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత
- డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా)
- డీసీసీబీ ఛైర్మన్‌గా పరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం జిల్లా)
- శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు -6
- విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 5
- విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 5
- తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 9
- పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 6
- కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 6
- గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 6
- ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 5
- నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 5
- చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 7
- అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీలకు – 5
- వైఎస్సార్ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 6
- కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు – 5