AP: పెన్షన్ రూ. 3వేలకు పెంపు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్ దారులకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. పెన్షన్ రూ. 3 వేలకు పెంచుతూ ఎపి కేబినేట్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సిఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఇప్పటి వరకు ఉన్న రూ. 2,750ను రూ.3 వేలకు పెంపెకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మిచౌంగ్ తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు సమాచారం.