AP: రేపటి నుండి వృద్ధాప్య పెన్షన్ రూ.3000
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/MONEY-IMAGE.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1వ తేదీ నుండి పెన్షనర్లకు రూ. 3000 అందనున్నాయి. సిఎం జగన్ రాష్ట్ర ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 8 రోజుల పాటు పెన్షన్ అందుకోవచ్చు. దీంతో పాటు కొత్తగా అర్హులైన 1,17,161 మందికి పెన్షన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. జనవరి 3వ తేదీ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పెన్షనర్లకు సిఎం అందజేయనున్నారు. వైఎస్ ఆర్‌సిపి ప్రభుత్వం ఏర్పడినప్పడు 2019 జులై నుండి 2,250 కి పెంచారు. అనంతరం 2022 జనవరిలో రూ.2,500కి పెంచిన వృద్ధాప్య పెన్షన్ మరల 2023 జనవరిలో రూ. 2,750కి పెంచారు. ఇపుడు తాజాగా రూ. 3000కు పెంచింది