AP: ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి టికెట్ ధరల పెంపుకు అనుమతి
అమరావతి (CLiC2NEWS): శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతే కాకుండా బెనిఫిట్ షోతో పాటు జనవరి 10న ఆరు షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంట ప్రీమియర్‌షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు.
మల్టిప్లెక్స్‌లో అదనంగా రూ.175 (జిఎస్‌టితో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ. 135 (జిఎస్‌టితో కలిపి) వరకు టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.జనవరి 11 వ తేదీ నుండి 23 తేదీ వరకు ఈ ధరలు ఐదు షోలకు అనుమతి ఇస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కియారా అడ్వాణి కథానాయిక. అంజలి, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.