ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2021/05/Result.jpg)
అమరావతి (CLiC2NEWS): ఎపి పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ మాట్లాడారు.. ఈ ఫలితాల్లో 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు… 15 మంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ పాలిసెట్ పరీక్షకు 1,60,329 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 1,43,592 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.