AP: వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌లో ఉపాధ్యాయుల‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

తాడేప‌ల్లి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్ నివార‌ణ, వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయ‌డం‌పై ఈరోజు క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో టీచ‌ర్ల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌ని, వీలైనంత త్వ‌ర‌గా వారికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ‘కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలి. ప్ర‌తి జిల్లాలో వీటినిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక సిబ్బందిని నియ‌మించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు 43ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ల‌ను ఇవ్వ‌గా.. వారు కేవ‌లం 5,24,347డోసులు మాత్ర‌మే వినియోగించార‌ని, అవి ప్ర‌భుత్వానికి ఇస్తే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా సాగుతుంద‌ని, దీనిగురించి కేంద్రానికి లేఖ రాస్తాన‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.
వృత్తివిద్యా కోర్సుల‌లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ, ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్, ప్లంబింగ్‌తో పాటు ఇతర అనుబంధ వైద్య విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి ప‌రిచే కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని అన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరుల సేవల కారణంగా… ఆస్పత్రుల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అంతేగాక చాలామందికి ఉద్యోగాలు వస్తాయని ఆయ‌న తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.