AP: పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే: సిఎం జగన్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు (గురువారం)`జగనన్న విద్యా దీవెన` రెండో విడత నిధులు విడుదల చేశారు. మొత్తం 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.693.81 కోట్లను జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. `పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే`, ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేదే నా తాపత్రయం అన్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుండి విద్యార్థుల భవిష్యత్తు కోసం 100% ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తున్నామన్నారు.
అలగే చాలా మంది పేద విద్యార్థులు పదోతరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదవడంలేదు. ఈ పరిస్థితిని మార్చడం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమచేస్తున్నామని సీఎం తెలిపారు. డిసెంబరులో మూడు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యారంగంపై ఇప్పటి వకరు రూ. 26,677 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు.