ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు..

అమరావతి (CLiC2NEWS): ఎపి ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్తనందించింది. వచ్చేనెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిధుల సర్దుబటు విషయంలో గతంలో జీతీల చెల్లింపు ఆలస్యమైందని.. దానిని కొందరు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ అభ్యర్థులకు ఉద్యోగులు మద్దతు తెలపాలని కోరారు. అంతేకాకుండా.. పిఆర్‌సి బకాయిలను ఏప్రిల్ నుండి సెప్టెంబరు లోగా రెండు విడతల్లో ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగుల జిపిఎఫ్ అడ్వాన్సులు, ఎపిజిఎల్ ఐ క్లెయిములు కలిపి సుమారు రూ.3వేల కోట్లను చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వానికి రూ. 1.25 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుంటే.. రూ. 90 వేల కోట్లు జీతాలకే సరిపోతుందన్నారు. ఇంకా దీంతో పాటు ప్రతి ఏడూ ఇంక్రిమెంట్లని, స్కేళ్ల పెంపనిరూ. 8వేల కోట్లు అధనంగా భారం పడుతుందని తెలియజేశారు.