AP: ఈఏడాది 10వ తరగతి పరీక్షలలో ఏడు పేపర్లే..
అమరావతి (CLiC2NEWS): 2021-2022 విద్యాసంవత్సరపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 7 పేపర్లు నిర్వహించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జిఓ నెంబర్ 79ను విడుదల చేశారు. 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష పేపర్లను 11నుండి ఏడింటికి కుదించిన విషయం తెలిసినదే. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈ సంవత్సరం కూడా పరీక్షపేపర్లను ఏడుకు తగ్గించినట్లుగా పేర్కొన్నారు.