కొడాలి నానికి కీలక పదవి..!
స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా కాడాలి నాని

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరాసరఫరాల మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఎపి స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. ఎపిలో నూతన మంత్రి వర్గం జాబితాను సిఎం జగన్ ఖరారు చేశారు. కాబినేట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయనుంది. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును నియమించారు. డిప్యూటి స్పీకర్‌గా కొలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నారు.