విజయవాడలో స్వర్ణాంధ్ర 2047 ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీ

విజయవాడలో ఎపి స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటి (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్ మెంట్ .. స్వర్ణాంధ్ర 2047 ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 29 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రొగ్రామ్/ ప్రాజెక్టు మేనేజర్ / సీనియర్ అనలిస్ట్ / సీనియర్ అడ్వైజర్ 4 పోస్టులు కలవు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. రూ.2 లక్షలు నుండి రూ.2.5 లక్షలుగా ఉంది.
కన్సల్టెంట్ / రిసెర్చ్ అసోసియేట్స్ 8 పోస్టులు కలవు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి వేతనం నెలకు రూ. 75వలే నుండి రూ. 1.50లక్షలు. డేటాబేస్ డెవలపర్ ఒక పోస్టు కలదు.. దీనికి ఎంపికైన వారిక నెలకు వేతనం రూ.45 వేల నుండి రూ.75వేలు వరకు అందుతుంది.
అర్హత .. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఇ/ బిటెక్/ బిఎస్‌సి కంప్యూటర్స్, పిజి లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసిఉ ఎకనామిక్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ / ఇంజినీరింగ్ / డెవలప్‌మెంట్ స్టడీస్ )తోపాటు పని అనభవం ఉండాలి. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విజవాడలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు మేనేజర్ పోస్టుకు 55 ఏళ్లు, కన్సల్టెంట్ పోస్టుకలు 45 ఏళ్లు, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు ఉండాలి. పూర్తి వివరాలకు www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.