అంతర్జాతీయ స్థాయిలో ఎపి విద్యార్థులు పోటీపడాలి: సిఎం జగన్

విజయవాడ (CLiC2NEWS): ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజవాడలో నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవతరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఎపి విద్యార్థులు పోటీ పడాలన్నారు. త్వరలో రాష్ట్రంలోని పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ను అమలు చేస్తామన్నారు. పరీక్షా విధానంలో ఇప్పటికే మార్పులు చేశామని, కొత్తగి అంతర్జాతీయ స్థాయి పరీక్ష విధానం తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూల్స్‌తో పోటీ పడేలా పాఠశాలల రూపు రేఖలు మార్చామని, సౌకర్యాలు మెరుగయ్యాయని ఆయన అన్నారు. చదువులకు పేదరికం అడ్డుకాకూడది, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యనభ్యసించాలని సిఎం ఆకాంక్షించారు.