టిడిపి-జనసేన 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో..
అమరావతి (CLiC2NEWS): టిడిపి-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. రూపొందించారు. ఎన్‌టిఆర్ భవన్‌లో తెలుగుదేశం-జనసేన పార్టీల సమావేశం ను సోమవారం నిర్వహించారు. ఈ భేటీలో 11 అంశాలతో కూడాన ఉమ్మడి మేనిఫెస్టోని రూపొందించారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, పట్టాభి.. జనసేన నుండ వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్‌కుమార్ ఉన్నారు. మేనిఫెస్టోలో టిడిపి నుండి 6 అంశాలు, జనసేన నుండి 5 అంశాలు చేర్చినట్లు మీడియాకు వివరించారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ. 10లక్షల వరకూ రాయితీ
ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహాకాలు
అమరావతియే రాజధానిగా కొనసాగింపు
పేదలకు ఉచిత ఇసుక, కార్మి సంక్షేమం
అసమానతలు తొలిగిపోయి.. ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు రూపకల్పన
బిసిలకు రక్షణ చట్టం తీసుకురావటం
రాష్ట్రాన్ని సంక్షోభం నుండి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం
రద్ద చేసిన సంక్షేమ పథకాలపై పునఃపరిశీలన.