తొలి ఏకాద‌శి: ఇంద్ర‌కీలాద్రిపై భ‌క్త‌జ‌న ప్ర‌వాహం..

విజ‌య‌వాడ (CLiC2NEWS): తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్ట్రాల్లోని దేవాల‌యాలు కిట‌కిట‌లాడుతున్నాయి. ఇక విజ‌య‌వాడ క‌న‌దుర్గ ఆల‌యంలో దుర్గ‌మ్మను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను స‌మ‌ర్పిస్తే మ‌రింత శుభం క‌లుగుతుంద‌నే న‌మ్మ‌కంతో ఆల‌యానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా అంత‌రాల‌య ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిపై నియంత్రణ విధించారు.

Leave A Reply

Your email address will not be published.