ఎపి టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌

పార్వ‌తీపురం మ‌న్యం ఫ‌స్ట్‌.. క‌ర్నూలు లాస్ట్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు సోమ‌వారం విడుద‌ల అయ్యాయి. ఈ ఫ‌లితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణిత న‌మోదైంది. ఈ ఫ‌లితాల్లో బాలిక‌లు 89.17 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలురు 84.32 శాతం పాస‌య్యారు.

ఫ‌లితాల్లో 96.37 శాతం ఉత్తీర్ణ‌త‌తో పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా అగ్ర‌స్థానంలో నిలిచింది. 62.47 శాతం ఉత్తీర్ణ‌త‌తో కర్నూలు చివ‌రి స్థానంలో నిలిచింది. ఈ ఫ‌లితాల వివ‌రాల‌ను విద్యా శాఖ క‌మిష‌న‌ర్ సురేష్ కుమార్ వివ‌రించారు.

మొత్తం ఫ‌లితాల్లో 69.26 శాతం ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌య్యారు. 11.87 శాతం సెకండ్ క్లాస్‌లో పాస‌య్యారు. 5.56 శాతం మంది థ‌ర్డ్ క్లాస్‌లో పాస‌య్యారు. కాగా అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను మే 24వ తేదీ నుంచి జూన్ 3 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. రేప‌టి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేష‌న్‌, రీ కౌంటింగ్ ధ‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. నాలుగు రోజుల్లో అధికారిక వెబ్‌సైట్ నుంచి మెమోలు డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.