కౌలు రైతుకు బ్యాంకు రుణం.. మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి (CLiC2NEWS): కొత్త సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందిచాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2019లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామన్నారు. కౌలు రైతులకు బ్యాంకు రుణం, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.