ఎపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా ఆమ్రపాలి

అమరావతి (CLiC2NEWS): తెలంగాణ నుండి రిలీవ్ అయిన ఐఎఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విసిఎండిగా ఆమ్రపాలిని నియమించారు. ఆమెకు ఎపి టూరిజం అథారిటి సిఇఒగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. ఆమెకు జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టరుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వాణీ ప్రసాద్‌ను కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు.
ఎపి వెళ్లాల్సి ఉండగా.. తెలంగాణలోనే కొనసాగుతామని ఇటీవల ఐఎఎస్ అధికారులు క్యాట్, హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్ఆలని క్యాట్‌ను ఆశ్రయించారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థలను పరిగణలోకి తీసుకోలేదని.. కేంద్రం జారీ చేసిన డిఒపిటి ఉత్తర్వులను రద్దుచేయాలని క్యాట్‌ను కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన డిఒపిటి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఎపికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.