AP: విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు వాయిదా వేయండి: గవర్నర్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించాలనుకున్న రాష్ట్ర విశ్వ విద్యాలయాల స్నాతకోత్సవాలను వాయిదా వేయాలని గవర్నర్ బిశ్వ భూషణ్ ఆదేశించారు. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి పరిస్థితులపై ఆయన ఉన్నత స్తాయి సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్నాతకోత్సవాలను వాయిదా వేయాలని ఆయా వర్సిటీల అధికారులను ఆదేశించారు.