AP: వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నిధుల విడుదల
6.67 లక్షల మంది రైతులకు సున్నవడ్డీ రాయితీ

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ రెండోవిడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విడుదల చేయనున్నారు. దీనిద్వారా 50.37 లక్షల మంది రైతులకు ఖాతాల్లోకి రూ.1,213 కోట్లు జమచేయనున్నారు. ఆగస్ట్‌లో విడుదలచేసిన రూ.977 కోట్లతో కలిపి మొత్త రైతులకు రూ. 2,052 కోట్లు లబ్ధి చేకూరుతుంది. దీంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్లు సున్నవడ్డీ రాయితీ నిధులు సిఎం వారి ఖాతాల్లోకి జమచేయనున్నారు. యంత్ర సేవా పథకం కింద 1,720 రైతు సంఘాలకు రూ.25.55 కోట్ల ను జమచేయనుంది.