పోలీసు నియామకాల దరఖాస్తు గడువు పొడిగింపు..
మరోసారి అభ్యర్థుల వయోపరిమితి పెంపు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగానలో పోలీసు ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుంది. కాగా తాజాగా ప్రభుత్వం వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగించిన నేపథ్యంలో దరఖాస్తు గడువును ఈ నెల 26 వ తేదీ వరకు పొడిగించింది. వయోపరిమితి పెంచడంతో మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున దరఖాస్తు గడువును పొడిగించినట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది.
మరోసారి అభ్యర్థుల వయోపరిమితి పెంపు
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియమకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారి అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపిని సిఎం ఆదేశించారు.
తాజాగా అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సిఎం నిర్ణయం తీసుకోవాడంతో మరికొంత మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించినట్లు అయింది.