TS: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ టిఆర్టి (టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుండి అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 20 నుండి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 11 జిల్లా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి.. తొలిసారిగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాలు, ఎస్ సి, ఎస్ టి, బిసి, ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. దరఖాస్తు రుసుం రూ. 1000 గా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.schooledu.telangana.gov.in వెబ్సైట్ చూడగలరు.