టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మాన్‌గా మాజి డిజిపి మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఛైర్మన్ పదవి కోసం మొత్తం 50 మంది దరఖాస్తు చేయగా.. మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ప్రశ్నా పత్రాల లీకేజి కేసులో టిఎస్‌పిఎస్‌సిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సిఎం రేవంత్ రెడ్డి.. ఛైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపిఎస్‌కు అప్పగించాలని సూచించారు. ఛైర్మాన్‌తో సహా సభ్యులు రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వం నూతన ఛైర్మన్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది.