ముగ్గురు ప్రభుత్వ సలహాదారుల నియామకం..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం సిఎం, ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సిఎం సలహాదారుగా మాజి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి.. ప్రభుత్వ సలహాదారులుగా మాజి మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత హర్కర వేణుగోపాల్‌ను నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజి ఎమ్మెల్యే మల్లు రవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నలుగురికి క్యాబినేట్ హోదా కూడా కల్పిస్తున్నట్లు తెలపింది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు అవకాశం కల్పించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటి వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ.. ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారునిగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వహించనున్నారు.