APPSC: గ్రూప్-1 ప్రిలిమినరీ ఎక్జామ్ డేట్ మార్పు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 18వ తేదీన జరగాల్సిన గ్రూప్-1 ప్రిలిమినరీ ఎక్జామ్ తేదీ మార్పు చేసినట్లు ఎపిపిఎస్‌సి ప్రకటించింది. పాలనా పరమైన కారణాలతో ఎక్జామ్ తేదీ మార్చిన అధికారులు కొత్త తేదీని నిర్ణయించారు. ఈ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన నర్వహించనున్నట్లు ఎపిపిఎస్‌సి కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ ప్రకటనలో వెల్లడించారు. ఎపిలో మొత్త 93 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు.