APPSC: 190 అసిస్టెంటు ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

అమరావతి (CLiC2NEWS): APPSC 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC నుండి వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏపీలోని పలు ఇంజనీరింగ్ సర్వీస్ విభాగాల్లోని అసిస్టెంటు ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు ఈనెల 21 నుంచి నవంబర్ 11 వరకు నిర్ణీత ఫీజును చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను అందజేయవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు. ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ కోసం మొత్తం 35 క్యారీ ఫార్వార్డ్ మరియు 155 తాజా ఖాళీలకు గాను 01.07.2021 నాటికి 18- 42 ఏళ్లలోపు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.