ఎపిఆర్‌జెసి సెట్‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల

అమ‌రావ‌తి(CLiC2NEWS):ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఎపిఆర్‌జెసి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. గురుకుల విద్యాల‌యాల్లో ఇంట‌ర్‌ మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌వేవాల‌కు 2023-24 విద్యాసంవ‌త్సారానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. దీనికి సంబంధించి ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్షకు ఏప్రిల్ 4వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు గురుకుల విద్యాల‌యాల సంస్థ కార్య‌ద‌ర్శి ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌ను మే 20వ తేదీ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు నిర్వ‌హిస్తారు. ఫ‌లితాల‌ను జూన్ 8వ తేదీన ప్ర‌క‌టిస్తారు. అదేవిధంగా పాఠ‌శాల‌ల్లో 5వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌తో పాటు ఆరు, ఏడు, ఎనిమిది త‌ర‌గ‌తుల‌లో మిగిలి ఉన్న సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు కూడా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల కోసం మే 20వ తేదీన ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. పూర్తి వివ‌రాల‌కు https://aprs.apcfss.in వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌ర‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.