తిరుమ‌ల‌కు వెళ్లే భ‌క్తుల‌కు ఎపిఎస్ఆర్టిసి ప్ర‌త్యేక స‌దుపాయం

అమ‌రావ‌తి (CLiC2NEWS): తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు ఎపిఎస్ఆర్టిసి ప్ర‌త్యేక స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు రాక‌పోక‌లు సుల‌భంగా కొన‌సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. తిరుప‌తి బ‌స్సులో సీటు బుక్ చేసుకున్న‌ప్పుడే తిరుమ‌ల రాక‌పోక‌ల‌కు క‌లిపి టికెట్లు జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. బ‌స్సు టికెట్‌తో పాటు శ్రీ‌వారి ద‌ర్శ‌నం టికెట్ బుక్ చేసుకున్న‌వారికి తిరుమ‌ల‌కు టికెట్లు జారీ చేయ‌నున్న‌ట్లు ఆర్టిసి ఈడి బ్ర‌హ్మ‌నంద రెడ్డి తెలిపారు. తిరుమ‌ల రాక‌పోక‌ల‌కు టికెట్ తీసుకున్న వారికి టికెట్ ధ‌ర‌లో 10% రాయితీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. తిరుప‌తి చేరుకున్న స‌మ‌యం నుండి 72 గంట‌లు పాటు తిరుప‌తి-తిరుమ‌ల మ‌ధ్య ట‌కెట్ చుట్లుబాట‌వుతుంద‌న్నారు. రేప‌టి నుండి ఈ విధానం అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.